నేను నోరు తెరిస్తే తట్టుకోలేవు, ఇంట్లోనే బంధించి కొట్టినా సిగ్గు రాలేదు- వైసీపీ ఎంపీ MVVకి వంశీ కౌంటర్

నేను ఏంటో విశాఖ వాసులుకు తెలుసు. నేను దేనికైనా రెడీ. ఎక్కడికైనా వస్తాను

నేను నోరు తెరిస్తే తట్టుకోలేవు, ఇంట్లోనే బంధించి కొట్టినా సిగ్గు రాలేదు- వైసీపీ ఎంపీ MVVకి వంశీ కౌంటర్

Vamsi Krishna Yadav Strong Counter MVV Satyanarayana

Vamsi Krishna Yadav : విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఘాటుగా బదులిచ్చారు. ఎంపీ ఎంవీవీపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేశారు వంశీ.

”నేను వైసీపీ గురించి మాట్లాడటం లేదు. కేవలం ఎంవీవీ టార్గెట్ గానే మాట్లాడాను. ఎంవీవీ సత్యనారాయణ విశాఖకి వచ్చేసరికి నేను 200 కోట్ల టర్నోవర్ కల బిజినెస్ చేస్తూ ఉన్నా. ఎంవీవీ వెధవ వ్యవహారాలకే ఆయన కుటుంబసభ్యులను కూడా ఇంట్లోనే బంధించి కొట్టారు. అయినా ఇంకా సిగ్గు రాలేదు. విశాఖలో అత్యధిక అప్పులు ఉన్న వ్యక్తి ఎంవీవీ సత్యనారాయణనే.

Also Read : ఎమ్మెల్సీ వంశీ యాదవ్‌పై విశాఖ ఎంపీ ఫిర్యాదు.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై పైర్

నీ వ్యక్తిగత విషయాలు బయటపెడితే తట్టుకోలేవు, సంధ్యా రాగం పాడాల్సిందే నీకు. జైల్లో వేసి తన్నడం వల్లే ఎంపీ ఎంవీవీ రాజకీయాల్లోకి వచ్చాడు. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది ఎంవీవీ సత్యనారాయణ. ఎంవీవీకి పొలిటికల్ జీవితం లేకుండా చేసేది నేనే. నేను మేయర్ అవ్వకుండా అడ్డుకున్నది ఎంవీవీనే. నేను ఏంటో విశాఖ వాసులుకు తెలుసు. నేను దేనికైనా రెడీ. ఎక్కడికైనా వస్తాను” అని చెలరేగిపోయారు వంశీకృష్ణ యాదవ్.

Also Read : సొంత జిల్లాలో బొత్సకు షాక్? వైసీపీకి దూరమవుతున్న ప్రధాన అనుచరులు..!