Rapaka Vara Prasada Rao
Rapaka Vara Prasada Rao: దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు (Rapaka Vara Prasada Rao) బహిరంగంగా ప్రకటించిన వీడియోపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రధాన ఎన్నికల అధికారి సమగ్ర నివేదిక కోరారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
రాపాక సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రాపాక చేసిన వ్యాఖ్యలపై రాజోలు నియోజకవర్గానికి చెందిన ఎనుముల వెంకటపతి రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (Chief Electoral Officer) ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) ఈ ఫిర్యాదుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.
వారం రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలని చెప్పారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న ఎన్నికల అక్రమాలను అంగీకరించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. తాను ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా దొంగ ఓట్లు వేశారని వరప్రసాద్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది.
Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు