Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు

Jupally, Ponguleti: ఈటల రాజేందర్ తో చర్చించిన అనంతరం వారిద్దరు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు

Jupally, Ponguleti

Jupally, Ponguleti: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఏ పార్టీలో చేరతారన్న విషయంపై కొన్ని రోజుల నుంచి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా, వారితో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. దీంతో వారు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఖమ్మంలో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… “ఇవాళ జరిగిన భేటీలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. వారు చెప్పేవి వారు చెప్పారు.. మేము చెప్పాల్సినవి మేము చెప్పాం. లక్ష్యసాధన కోసం చేయాల్సిన అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తాం.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరం సంఘటితం కావాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు (సీఎం కేసీఆర్) పదహారు సీట్లు గెలుస్తామని అన్నారు. ఏమి జరిగిందో అందరికీ తెలుసు” అని చెప్పారు. బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారని ఆయన వివరించారు.

కాగా, ఇవాళ ఖమ్మంలో బీజేపీ తెలంగాణ చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి చర్చించింది. ఈటల రాజేందర్ సహా రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, తదితరులు కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఒక వేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం ఖాయమైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వారు కాషాయా కండువా కప్పుకుంటారు.

Revanth Reddy : ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మమేమిటి? : రేవంత్ రెడ్డి