×
Ad

Arasavalli Ratha Saptami : అరసవల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు..

Arasavalli Ratha Saptami : అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.

Arasavalli Ratha Saptami

  • అర్సవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు
  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన హోమంత్రి అనిత

Arasavalli Ratha Saptami : అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఓ వైపు సూర్య జయంతి.. మరోవైపు ఆదివారం.. ఈ పర్వదినాన ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్తజనం పోటెత్తారు.

Also Read : Cm Chandrababu: విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి క్షీరాభిషేకాన్ని కనులపండువగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులతోపాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలురు రాజకీయ ప్రముఖులు, అధికారులు ఉన్నారు.