Floods : రాయల చెరువు తెగిపోతుందా ? ఖాళీ చేయాలని చాటింపులు

వస్తున్న వరదలతోనే సతమతమౌతుంటే..మరో ముప్పు పొంచి ఉందని చెబుతుండడంతో హఢలిపోతున్నారు చిత్తూరు  జిల్లాలోని కొన్ని ప్రాంతాల వాసులు.

Rayalacheruvu : చిత్తూరు జిల్లాపై వరుణుడు పగ బట్టాడా ? కుంభవృష్టిగా వానలు కురుస్తుండడంతో భారీస్థాయిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. రహదారులా ? చెరువులా ? అనే పరిస్థితి నెలకొంది. ఎన్నో  ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకపోయాయి. కనివినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాపై భారీ స్థాయిలో ఎఫెక్ట్ పడింది. వస్తున్న వరదలతోనే సతమతమౌతుంటే..మరో ముప్పు పొంచి ఉందని చెబుతుండడంతో హఢలిపోతున్నారు చిత్తూరు  జిల్లాలోని కొన్ని ప్రాంతాల వాసులు.

Read More : Heavy Flood : పెన్నా ఉగ్రరూపం..రాకపోకలు బంద్, ప్రజలు జాగ్రత్త

ఎందుకంటే..రాయల చెరువు పూర్తిగా నిండిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం. తూముల ద్వారా..అవుట్ ఫ్లో తక్కువగా ఉండడంతో ఈ చెరువు నిండుకుండలా తలపిస్తోంది. చెరువు ఎప్పుడు తెగిపోతుందా ? అనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో…అధికారులు అప్రమత్తమై..చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరిలి వెళ్లాలని చాటింపులు వేస్తున్నారు.

Read More : Varun Gandhi : రైతు ఉద్యమం ఆగాలంటే ఆ డిమాండ్ కూడా నెరవేర్చాల్సిందే..మోదీకి వరుణ్ గాంధీ లేఖ

రాయల చెరువు ఈ స్థాయిలో వరద ప్రవాహం ఉండడం, పూర్తిగా నిండిపోవడం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందంటున్నారు అక్కడి గ్రామాల వాసులు. రాయల్ చెరువులో ఉన్న నీటిని త్వరితగతిన బయటకు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బలిజపల్లె, సంజీవపురం, పద్మవల్లిపురం, గంగిరెడ్డి పల్లి నాలుగు గ్రామాలున్నాయి. చెరువు కట్ట తెగిపోతే…ఈ నాలుగు గ్రామాలు నీటితో మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటలుగా తిరుపతిలో వర్షం లేకపోయినా…వరద ఉధృతి మాత్రం కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు