Heavy Flood : పెన్నా ఉగ్రరూపం..రాకపోకలు బంద్, ప్రజలు జాగ్రత్త
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..

Penna River : తుపాను ప్రభావం తగ్గినా.. కడప జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాన్ని వరదలు వణికిస్తున్నాయి. గండికోట జలాశయానికి పెద్ద ఎత్తున పైభాగం నుంచి నీరు వచ్చి చేరడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని యధావిధిగా మైలవరం రిజర్వాయర్‌కు వదలుతున్నారు. దీంతో మైలవరం నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా లక్షా 70 వేల క్యూసెక్యుల నీటిని పెన్నానదిలోకి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా పెన్నా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. సమీప గ్రామాలకు వరద పోటెత్తింది.
Read More : Gujarati Singer : ఇదేం పిచ్చి..సింగర్‌పై డబ్బుల వర్షం, వీడియో వైరల్
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రొద్దుటూరు -ఎర్రగుంట్ల మధ్య ప్రధాన రహదారిలోని పెన్నా బ్రిడ్జిపై రాత్రి నుంచే రాకపోకలను ఆపేశారు. ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు, సోములవారిపల్లె, నంగనూరుపల్లె, రేగళ్ల పల్లె తదితర గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వరద నీటిలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో సాగుచేసిన శనగ, మినుము, వరి, పత్తి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
Read More : Sexual Abuse : కరస్పాండెంట్ వేధిస్తున్నాడని నర్సింగ్ విద్యార్ధినుల ధర్నా
2002 తరువాత ఇంత పెద్ద ఎత్తున పెన్నా నదికి నీరు రావడంతో ఇదేనని చెబుతున్నారు స్థానికులు. పెన్నా నదికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ప్రొద్దుటూరులో రెండు చోట్ల సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు రాకపోకలు లేకపోవడంతో జమ్మలమడుగు, ముద్దనూరు మీదుగా ఎర్రగుంట్లకు వాహనాలను దారి మళ్లించారు. మైలవరం జలాశయం నుంచి నీటి విడుదల తగ్గేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షం..14మంది మృతి
- Kadapa : చిరుజల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు..సీఎం షెడ్యూల్లో మార్పులు ?
- Rajasthan : వాన వాన వెళ్లువాయే, నాలుగు రోజుల నుంచి వర్షాలు..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు
- Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు
- Mydukur Municipality : మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ, క్యాంపు రాజకీయాలు షురూ
1Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
2Viral video: ఇదేంది సారూ.. ఒకే సారి, ఒకే బోర్డుపై ఉర్దూ, హిందీ పాఠాల బోధన.. ప్రతీరోజూ అంతే..
3Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
4Shivathmika Rajashekar : చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న శివాత్మిక
5AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!
6Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
7Russia president: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
8Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
9Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
10Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
-
Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు
-
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్