×
Ad

రాయలసీమ లిఫ్ట్ కోసం ఉద్యమం.. వైఎస్ జగన్ ప్రకటన..

YS Jagan : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించకుండా సీఎం చంద్రబాబు నాయుడు సమర్థించారు. అంటే రహస్య ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టేనని జగన్ అన్నారు.

YS Jagan

  • చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గొప్ప ప్రాజెక్టు
  • సీమను కరువు నుండి బయటపడేసేది ఇది ఒక్కటే
  • రాయలసీమ లిఫ్ట్‌కోసం ఉద్యమాలు చేస్తాం
  • మళ్లీ మేము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తాం

YS Jagan : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాటలు వింటుంటే మనుషులా రాక్షసులా అనిపిస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నా కోరిక మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ఆపేశారని ఏకంగా నిండు సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలను కనీసం ఖండించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద విలన్. రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని జగన్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

Also Read : APSRTC : సంక్రాంతి వేళ ప్రయాణికులకు బిగ్‌షాక్.. నిలిచిపోనున్న బస్సులు.. 12 నుంచి సమ్మెబాట!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించకుండా సమర్థించారు. అంటే రహస్య ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టేనని జగన్ అన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు.. ఇప్పుడు జన్మనిచ్చిన సీమను వెన్నుపోటు పొడిచాడని జగన్ విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గొప్ప ప్రాజెక్ట్. సీమను కరువు నుండి బయటపడేసేది ఇది ఒక్కటే. సీమ ప్రాంతానికి ఓ ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు.. సంజీవని లాంటిదని జగన్ అన్నారు.

కేటాయింపులకు మించి తెలంగాణ నీరు వాడేస్తుంది. 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద నాలుగు సంవత్సరాలు మాత్రమే కేటాయింపుకు తగిన నీళ్లు వచ్చాయి.. సీమలో నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే తెలంగాణ లో పవర్ హౌస్ రన్ చేస్తున్నారని జగన్ అన్నారు. లిఫ్ట్, పవర్ హౌస్‌ల ద్వారా రోజుకి 8 టీఎంసీ‌ల నీరు తెలంగాణ వాడేస్తుంది. ఇష్టమొచ్చినట్టు పైనవాళ్ళు నీళ్లు వాడేస్తుంటే అడ్డుకోలేని పరిస్థితిల్లో వీళ్ళు ఉన్నారు. ఏపీ భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా తెలంగాణ చేతిలో పెట్టారు. పైన తెలంగాణ కట్టిన ఏ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులు లేవు.. ఓటుకు నోటు కేసు కోసం ఇవన్నీ తెలంగాణకు చంద్రబాబు అప్పగించేశారు. మేము అధికారంలోకి వచ్చాక వీటన్నింటికీ వెనక్కి తీసుకున్నామని జగన్ అన్నారు.

2019లో సీమకు నీరు ఇవ్వడానికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాం. శ్రీశైలం 800 అడుగులలోనే రోజుకి మూడు టీఎంసీ నీరు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాం. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి పనులు వేగంగా జరిపాం. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే పూర్తి అయ్యేది. రాకపోవడమే దురదృష్టం. ఈ ప్రాజెక్టు‌కు చంద్రగ్రహణం పట్టింది అంటూ జగన్ విమర్శలు చేశారు.

ఎన్జీటీ మూడు సార్లు సమావేశం పెడితే చంద్రబాబు స్పందించలేదు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రాజెక్టును చంద్రబాబు ఖూనీ చేశాడు. అసలు ఈ ప్రాజెక్టు అవసరంలేదని వీళ్లే ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చెయ్యకుండా దుర్మార్గంగా చులకనగా మాట్లాడుతున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఉద్యమాలు చేస్తాం. మళ్లీ మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ అన్నారు.

తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు అన్నదమ్ములమే. కలిసే పెరిగాం. ఒకటే భాష మాట్లాడతాం. అందరికీ మంచి జరగాలి.. తెలగాణకు అన్యాయం జరగాలని నేనెప్పుడూ అనుకోను. రాయలసీమ కు జరుగుతున్న అన్యాయాన్ని చూసి అర్థం చేసుకోవాలి. ఇందులో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చెయ్యకూడదు. వాస్తవాలు తెలియజేయాలి. ప్రజలు అర్ధం చేసుకుంటారు. కొందరు అలాంటి రాజకీయాలు చేస్తున్నారు.. అది చాలా తప్పు అని జగన్ అన్నారు.