ఈ బంధం గట్టిది: టీడీపీ జనసేన దగ్గరవుతున్నాయా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

  • Publish Date - January 14, 2019 / 10:53 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.. గత ఎన్నికల్లో కలిసి, తరువాత విడిపోయి, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా పార్టీలు..? కలుస్తాయి అంటూ జరుగుతున్న ప్రచారానికి కారణం ఏంటి..? వాచ్ దిస్ స్టోరి… ఏపీలో ఒకప్పటి మిత్ర పార్టీలు టీడీపీ, జనసేనల మధ్య బంధం మరోసారి బలపడుతునట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా తరువాత ఇటు టీడీపీని, అటు ప్రభుత్వాన్ని విభేదిస్తూ బయటకు వచ్చారు పవన్. టీడీపీ కూడా పవన్ ని విమర్శిస్తూ వచ్చింది.

బీజేపీ చెప్పినట్లు పవన్ వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శించారు.. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల ఆ రెండు పార్టీల మధ్య పరిస్థితి మారింది. ఇద్దరు నాయకుల స్వరాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ లు చేస్తున్న కొన్ని ఆసక్తికర కామెంట్స్ టీడీపీ, జనసేన మధ్య స్నేహాన్ని గుర్తుచేస్తున్నాయి. ఓపక్క రెండు పార్టీలు మరో సారి కలవబోతునట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చినట్లుగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి తోడు ఇద్దరి నేతల కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

అసలు ఈ చర్చకు ఆజ్యం పోసింది సాక్షాత్తు సీఎం చంద్రబాబు. ఓ మీడియా సమావేశంలో పవన్ పై చంద్రబాబు చేసిన ఆసక్తికర కామెంట్స్ వీరిద్దరి బంధంపై ప్రచారానికి తెర తీసింది. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసాం, వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తాం, ప్రతిపక్ష పార్టీకి ఏంటి బాధ….? అంటూ చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. తరువాత రోజు జన్మభూమి కార్యక్రమంలోనూ కేంద్రంపై పోరాటం చెయ్యడానికి పవన్ మాతో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ, జనసేన కలవబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది.

అయితే చంద్రబాబు వ్యాఖ్యల్ని పవన్ నామ మాత్రంగానే ఖండించారు కానీ అనుకునేంత స్థాయిలో తిప్పి కొట్టలేదనే భావన ఆపార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. దీంతో టీడీపీపై పవన్ స్వరం మారుతోందంటున్నారు. మొదట్లో టీడీపీని గట్టిగా విమర్శించే పవన్ ఇటీవల వైసీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబుకి అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు పవన్. దీంతో టీడీపీకి అనుకూలంగా పవన్ మారుతున్నారని మరోసారి జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు తాజాగా గుంటూరు జిల్లాలో పవన్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఊతం అందిస్తున్నాయి. పెదరావురు సభలో చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కామెంట్ చేశారు. చంద్రబాబుపై కక్ష సాధించడానికి కేసీఆర్ జగన్ తో కలిసారని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

ఈ రెండు పార్టీల మధ్య బంధంపై ఓ పక్క రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంటే,రెండు పార్టీలలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధినేత మనసులో మాట తమకు తెలియడం లేదంటున్నారు జనసేన నేతలు. ఇక టీడీపీలో మాత్రం రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. పవన్ తమతో కలిస్తే తమకు మరింత బలం చేకూరుతుందని  కొంత మంది బావిస్తుంటే, పవన్ తో కలిస్తే నష్టం అని కొందరు అంటున్నారు. ప్రభుత్వమైనా పార్టీపైనా తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ ని కలుపుకుంటే పార్టీ క్యాడర్ లో వ్యతిరేకత వస్తుందంటున్నారు. అయితే పవన్ తో నేరుగా రిలేషన్ కంటే బయట నుండి పోటీ చేస్తేనే బెటర్ అంటున్నారు. సెపరేట్ గా పోటీ చేస్తే వైసీపీ కి వెళ్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పవన్ కి వెళతాయి అంటున్నారు.

ఇక ఈ రెండు పార్టీల బంధం మరోసారి బలపడిందంటూ వైసీపీ చెబుతోంది. పవన్ యూరప్ టూర్ లో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందంటున్నారు. చంద్రబాబుకు సన్నిహింతంగా ఉండే వ్యక్తులు ఇటీవల పవన్ కి సన్నిహితంగా ఉంటున్నారు వారే రెండు పార్టీలమద్య ఒప్పందం కుదిర్చారు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి టీడీపీ జనసేన మైత్రిపై.ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చర్చకు తగ్గట్టుగానే రెండు పార్టీల అధినేతలు వ్యాఖ్యలు చెయ్యడం చర్చకు ప్రాణం పోస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.