ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం?

ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను అధికారులు రంగంలోకి దించారు.

Prakasam Barrage Boats Removal : ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు పనులు మూడవ రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తియ్యడం సాధ్యం కాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తొలగిస్తున్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను అధికారులు రంగంలోకి దించారు.

ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లను తీయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బోట్లు చాలా భారీగా ఉన్నాయి. బాగా బలంగా కూడా ఉన్నాయి. దాంతో వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. వాటిని తొలగించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. సాధారణంగా బోట్లు అంటే చెక్కతో ఉంటాయి. చెక్కతో ఉండే బోటు ఎంత పెద్దగా ఉన్నా.. వాటిని ఈజీగా కట్ చేసి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లు పూర్తిగా ఐరన్ తో చేసినవి. చాలా బలమైన ఐరన్ తో వాటిని తయారు చేశారు. చాలా ధృడంగా ఉంది. బోటు ఖాళీగా ఉంటేనే దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇక నీటిలో పడిందంటే బరువు మరింత పెరుగుతుంది.

వంద టన్నుల బరువును మోయగల క్రేన్ కూడా ఈ బోట్లను కదలించలేని పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రేన్లతో బోట్లను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఇంచు కూడా కదల్లేదు. బోట్లు తీయడం చాలా కష్ట సాధ్యమైన పరిస్థితి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి బోట్లు తీసేయాల్సిందే. ముందు ముందు నీటి ప్రవాహం పెరిగితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటున్నారు అధికారులు.

బోట్లను వెలికితీసే విషయంలో ప్లాన్ ఏ పని చేయలేదు. దీంతో ప్లాన్ బి ని అధికారులు అమలు చేస్తున్నారు. ప్లాన్ బి లో భాగంగా బోట్లను ముక్కలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం బోట్లను కట్ చేసే ప్రక్రియ మొదలైంది. కొంతమంది నీటి పైన భాగంలో కట్ చేస్తున్నారు. మరికొందరు క్యూబా డైవింగ్ ద్వారా నీటి లోపలికి వెళ్లి దాదాపు 12 నుంచి 15 అడుగులు ఉన్న నీటిలో కటింగ్ ప్రక్రియ జరుగుతోంది.

అండర్ వాటర్ ఆపరేషన్..
* వరుసగా మూడో రోజు ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ
* బోట్లను తొలగించేందుకు శ్రమిస్తున్న ఇంజినీర్లు
* చాలా క్లిష్టంగా కొనసాగుతున్న పడవల కోత ప్రక్రియ
* బోట్లను తీసేందుకు రంగంలోకి దిగిన సీలైన్ డైవింగ్ కంపెనీ
* బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో పైకి తీసే ప్రయత్నం
* స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నదిలోకి వెళ్లిన డైవింగ్ టీమ్
* ఇప్పటివరకు ఒక భారీ పడవను 6 మీటర్ల మేర కోసిన డైవింగ్ టీమ్
* పడవల తొలగింపునకు మరో 3 రోజులు పట్టే అవకాశం
* నది లోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను రెండుగా కోస్తున్న సిబ్బంది

 

Also Read : నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?

ట్రెండింగ్ వార్తలు