YSRCP : వాళ్ల ఓట్లు తొలగించండి, ఏపీలో ఓటు వేయకుండా చూడండి- ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు

హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.

Double Entry Voters (Photo : Google)

ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలిశారు. మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.

డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరామన్నారు మంత్రి జోగి రమేశ్. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి బోగస్ ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని సీఈవోని కోరామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమని ఫిర్యాదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

Also Read : రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు

మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా- మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్
ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

 

ట్రెండింగ్ వార్తలు