Tirumala : తిరుమలలో గదుల కేటాయింపు మరింత సులభం

తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు కష్టాలు తప్పనున్నాయి. గదుల కేటాయింపును టీటీడీ మరింత సులభతరం చేసింది.

Rent Rooms Booking Procedure Of Tirumala Made Easy

Tirumala : తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు కష్టాలు తప్పనున్నాయి. గదుల కేటాయింపును టీటీడీ మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు కోసం తిరుమలలో ఆరు చోట్ల కొత్తగా రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.

జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ బగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. గదులు కావల్సిన వారు ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారాన్ని పంపుతుంది.

మెసేజ్ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా టీటీడీ ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం 8గంటలకు ఈ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను టీటీడీ అధికారులు ప్రారంభించనున్నారు.