Cows In Velugodu Project : వెలుగోడు రిజర్వాయర్‌లో గల్లంతైన ఆవులు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.

Cows In Velugodu Project : నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఆవుల గల్లంతుపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో స్పందించిన అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. రిజర్వాయర్ లో గల్లంతైన ఆవులను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.

అటు ప్రాజెక్ట్ పరిధిలో భారీ వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి మిగతా ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆవులు ప్రాజెక్ట్ డీప్ వాటర్ లోకి వెళ్లడంతో చేపల కోసం వేసిన భారీ వలలో చిక్కుకుంటే ప్రాణాలతో ఉండే అవకాశం లేదంటున్నారు.

Cows Missing : వెలుగోడు రిజర్వాయర్ లో ఆవుల గల్లంతు.. ఇంకా లభించని 150కిపైగా గోవుల ఆచూకీ

అయినప్పటికీ వాటి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్న రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోవడం, మోసళ్లు తిరిగే అవకాశం ఉండటంతో ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసి మళ్లీ మొదలుపెట్టారు.

శుక్రవారం ఉదయం వెలుగొండ ప్రాజెక్ట్ సమీపంలోని గ్రామాల ప్రజలు వెయ్యి ఆవులను మేత కోసం వదిలారు. అవి మేత వేస్తుండగా.. అడవి పందులు వెంటపడి తరిమాయి. భయపడిన ఆవుల మంద వెలుగోడు ప్రాజెక్ట్ లోని నీటిలోకి పరుగులు తీశాయి. బెదిరిపోయిన గోవులు ప్రాజెక్ట్ నుంచి దూరంగా నీటిలో ఈదుకుంటూ వెళ్లాయి. ఆవులు నది మధ్యలోకి వెళ్లడం గమనించిన పశువుల కాపరులు, స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు పడవలు, తెప్పలతో పశువులను అనుసరించారు. కొంతదూరం వెళ్లాక ఆవులను గ్రూపులుగా విడగొట్టారు. దాదాపు 350కి పైగా గోవులను ఒడ్డుకు చేర్చారు. అసలే వర్షాలు.. జలాశయం నిండుగా ఉంది. దీంతో నీటి ప్రవాహానికి కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి. 350 గోవుల్లో 150 ఆవులు గల్లంతయ్యాయి.

Cows In Velugodu Reservoir : టెన్ టీవీ ఎఫెక్ట్.. వెలుగోడు రిజర్వాయర్‌లో కొట్టుకుపోయిన ఆవులను కాపాడేందుకు చర్యలు

వెలుగోడు రిజర్వాయర్ లో గోవుల గల్లంతుపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. మూగజీవాల కోసం వాటి యజమానులు పడుతున్న వ్యథను కళ్లకు కట్టింది. 500 గోవులు ప్రాజెక్ట్ లో గల్లంతు కాగా, 350 ఆవులను మత్స్యకారులు కాపాడారు. మరో 150 ఆవులు గల్లంతయ్యాయి. టెన్ టీవీ వరుస కథనాలతో వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మేల్కొన్నారు. గల్లంతైన గోవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

శుక్రవారం ఉదయం ఘటన జరిగినా.. సాయంత్రం వరకు ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకోలేదు. టెన్ టీవీ వరుస కథనాలతో ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారుల్లో చలనం వచ్చింది. ముందుగా ప్రాజెక్ట్ లోకి వచ్చే ఇన్ ఫ్లోని తగ్గించారు. పోతిరెడ్డిపాడు రెగులేటర్ వద్ద వాటర్ ఇన్ ఫ్లోని తగ్గించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సాయంతో రిజర్వాయర్ లో గాలింపు ప్రారంభించారు. వెలుగోడు చేరుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

 

ట్రెండింగ్ వార్తలు