Cows Missing : వెలుగోడు రిజర్వాయర్ లో ఆవుల గల్లంతు.. ఇంకా లభించని 150కిపైగా గోవుల ఆచూకీ

వెలుగోడు ప్రాజెక్ట్‌లో గల్లంతైన 150కిపైగా ఆవుల ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి ప్రాజెక్ట్‌లో మొసళ్లు సంచరించే అవకాశం ఉండడంతో.. గాలింపు నిలిపివేశారు. మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో గోవుల కోసం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.

Cows Missing : వెలుగోడు రిజర్వాయర్ లో ఆవుల గల్లంతు.. ఇంకా లభించని 150కిపైగా గోవుల ఆచూకీ

Cows Missing

Cows Missing : వెలుగోడు ప్రాజెక్ట్‌లో గల్లంతైన 150కిపైగా ఆవుల ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి ప్రాజెక్ట్‌లో మొసళ్లు సంచరించే అవకాశం ఉండడంతో.. గాలింపు నిలిపివేశారు. మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో గోవుల కోసం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. నిన్న వెలిగొండ ప్రాజెక్ట్ సమీపంలోని గ్రామాల ప్రజలు.. 500లకు పైగా ఆవులను మేత కోసం వదిలారు. అవి పొలాల్లో మేత మేస్తుండగా.. అడవి పందులు వెంటపడ్డాయి.

దీంతో ఆవుల మంద.. ప్రాజెక్ట్‌లోని నీటిలోకి పరుగులు తీశాయి. ఆవులు నది మధ్యలోకి వెళ్లడాన్ని గమనించిన పశువుల కాపర్లు.. స్థానికంగా ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేశారు. దీంతో వారు హుటాహుటిన పడవలు, తెప్పలతో పశువులను అనుసరించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆవులను గ్రూపులుగా విడగొట్టారు. దాదాపు 350 ఆవులను ఒడ్డుకు చేర్చారు.

Nandyala: ఆవుల మందను తరిమిన అడవిపందుల గుంపు..భయంతో రిజర్వాయర్ లో చిక్కుకున్న గోమాతలు

మరో 150కిపైగా ఆవుల ఆచూకీ లభించకపోవడంతో.. మత్స్యకారులు తిరిగి గాలింపు చేపట్టారు. ఆవులు ప్రాజెక్ట్ డీప్ వాటర్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. డీప్ వాటర్‌లో చేపల కోసం భారీ వలలు వేశారని, ఒకవేళ గోవులు వాటిలో చిక్కుకుంటే.. ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్నారు. అయినప్పటికీ వాటి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపుచేపట్టారు. ఉదయం నుంచి మత్స్యకారుల సాయంతో గోవుల కాపరులు, యజమానులు గాలించారు.

వెలుగోడులో గోవుల గోసపై 10టీవీ వరుస కథనాలతో… ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. ముందుగా ప్రాజెక్ట్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లోను తగ్గించారు. పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ వద్ద వాటర్ ఇన్‌ఫ్లో తగ్గించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారుల సాయంతో రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టారు. గోవులను రక్షించాలని రైతులు, కాపరులు కోరుతున్నారు.