Nandyala: ఆవుల మందను తరిమిన అడవిపందుల గుంపు..భయంతో రిజర్వాయర్ లో చిక్కుకున్న గోమాతలు

మేతకు వెళ్లిన ఆవుల గుంపును అడవిపందులు తరిమాయి. దీంతో భయపడిన ఆవుల మంద వెలుగోడు జలాశయంలోకి దిగి నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి.

Nandyala: ఆవుల మందను తరిమిన అడవిపందుల గుంపు..భయంతో రిజర్వాయర్ లో చిక్కుకున్న గోమాతలు

Nandyala Villagers Rescued 350 Cows

Nandyala villagers rescued 350 cows : నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో 500ల ఆవులు గల్లంతు అయ్యాయి. వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల గుంపును అడవిపందులు తరిమాయి. దీంతో భయపడిన ఆవులు వెలుగోడు జలాశయంలోకి దిగాయి. అసలే వర్షాలు..జలాశయం నిండుగా ఉంది. దీంతో నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోతుండా గమనించిన స్థానికులు 350 ఆవులను రక్షించారు. గల్లంతా అయిని మరో 150 ఆవులు కోసం గాలిస్తున్నారు.

వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన 500 ఆవులను సమీప అడవిపందులు వెంటపడి తరిమాయి. దీంతో ఆవులన్ని వెలుగోడు జలాశయంలో ప్రాణాలు కాపాడుకోవటానికి జలాశయంలోకి దిగిపోయాయి. అలా నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకు పోతుండగా గమనించిన గ్రామస్థులు 350 ఆవులను రక్షించారు. మరో 150 ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆవులను రక్షించటానికి గ్రామస్థులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం గాలిస్తున్నారు.