AP COVID-19 : ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 39కి చేరిన కేసులు.. అధికారులు కీలక సూచనలు

AP COVID-19 : ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా మరో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి.

Rising number of COVID-19 cases in Andhra Pradesh

  • ఏపీలో విజృంభిస్తున్న కరోనా
  • రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులు
  • 39కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య

AP COVID-19 : దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read : Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఫ్యామిలీపై గృహ హింస కేసు.. కోడలు మేఘన సంచలన ఫిర్యాదు

ఏపీలో శుక్రవారం మరో ఏడు కరోనా కేసులు నమోదవడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కు చేరింది. తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 266 మంది నమూనాలను పరీక్షిస్తే 39మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. 17మంది హోం ఐసోలేషన్లో, 13మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు కోలుకొని ఇండ్లకు వెళ్లారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లు, అవసరమైన మందులు, ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసింది. కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.

అయితే, కడప జిల్లాలో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్ RF.5 సబ్‌వేరియంట్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) గుర్తించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ చర్యలను వేగవంతం చేసింది.

రద్దీ ప్రాంతాలు, ఆస్పత్రులు, బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలో ప్రయాణించే వారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు.