CM Jagan : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. CM Jagan

CM Jagan On Annamayya Road Accident(Photo : Google)

CM Jagan – Road Accident : అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అనౌన్స్ చేశారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Also Read..Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, అక్కడికక్కడే నలుగురు దుర్మరణం

దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు..
అన్నమయ్య జిల్లా పుల్లంపేట రహదారిలో ఆయిల్ ట్యాంకర్ లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం అన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా రోడ్ సేఫ్టీకి సంబంధించిన చర్యలు చేపట్టాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు పురంధేశ్వరి.