Karnataka Road Accident
Road Accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిర్ జిల్లాలో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, మరో 13మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు, బండి ఆత్మకూరు వాసులుగా గుర్తించారు.
Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో చోరీలు, రోడ్డు ప్రమాదాల ఘటనల వివరాలు ..
బండి ఆత్మకూరు, వెలుగోడు నుంచి 21 మంది గుల్బర్గా దర్గా దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో వెలుగోడు చెందిన నలుగురు, బండిఆత్మకూరు చెందిన ఒకరిగా పోలీసులు గుర్తించారు. ఐదుగురు మృతితో వెలుగోడు, బండి ఆత్మకూరులో విషాదం అలముకుంది. ఈ ఘటనపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నంద్యాల వాసులు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. మృతికి సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు, మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ప్రక్రియలో ఎంత ఖర్చునైనా భరిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. అంతేకాక, సంఘటన స్థలానికి అడ్వకేట్‌తో కలిపి నాయకులను పంపించారు.
Karnataka: Five killed, 13 injured in road accident in Yadgiri
Read @ANI Story | https://t.co/WNRuIKwzMQ#Karnataka #Yadgiri #RoadAccident pic.twitter.com/y1VhR7NLuM
— ANI Digital (@ani_digital) June 6, 2023
మృతులను మునీర్ (40), నయామత్ (40), రమీజా బేగం (50), ముద్దత్ షీర్ (12), సుమ్మి (13)గా గుర్తించారు. ప్రమాదంలో వెలుగోడు గ్రామానికి చెందిన తండ్రీ మనీర్, కొడుకు ముద్దత్ షీర్ ఇద్దరూ చనిపోయారు. మనీర్ భార్య భాను తీవ్రంగా గాయపడినట్లు వారి బంధువులుతెలిపారు. వీరంతా బంధువులు కావడంతో తుఫాన్ వాహనంలో దైవదర్శనానికి వెళ్తున్నారు. ఇదిలాఉంటే, ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి రోధనలతో వెలుగోడు, బండిఆత్మకూరులో విషాధం నెలకొంది.