Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident

Road Accident in Palnadu District: ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Also Read: Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారు ప్రమాదంలో గాయపడిన వారిని పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్దారించారు. తెలంగాణలోని కొండగట్టు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా శ్రీపొట్టిశ్రీరాము నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.