Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ.

Road Accident

Road Accident – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి (Tirupati)- శ్రీకాళహస్తి (Srikalahasti) రహదారిలోని మిట్ట కండ్రిగ వద్ద ఓ లారీని కారు ఢీ కొట్టింది. ఆ కారులో ఏడుగురు తిరుమల నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది.

దీంతో అక్కడికక్కడే కారులోని ముగ్గురు మహిళలు సహా మొత్తం ఆరుగులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొనడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు అందరూ విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ అని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Bihar : యువకుడి పైశాచికత్వం .. ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఎదురుగా వెళ్తున్న ట్రైన్‌లోని ప్రయాణికుల్ని బెల్టుతో కొట్టాడు