Chengalpattu Express
Chengalpattu Express Robbery: ఏపీలో దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం జిల్లాలో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రైలులో దోపిడీకి పాల్పడ్డారు.
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దోపీడి జరిగింది. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో దొంగలు సిగ్నల్ వైర్లను కత్తిరించారు. సిగ్నల్ చూపకపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. వెంటనే ఎస్1, ఎస్ 2 బోగీల్లోకి దుండగులు చొరబడి ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారు. ఓ మహిళ నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.