టీడీపీ, జనసేన జాబితాను చూసి మా వాళ్లు సంబరాలు చేసుకున్నారు: రోజా

తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని రోజా చెప్పారు.

Minister Roja

Minister Roja: టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాను పేలవంగా విడుదల చేశారని రాష్ట్ర మంత్రి అన్నారు. ఆ జాబితాను చూసి వైసీపీ వాళ్లు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రజలు మోసం చేసిందని రోజా అన్నారు. అప్పట్లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడారు.

తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని రోజా చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సభ తర్వాత ఆ కూటమి ఓటమని ఖరారైందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఎళ్లుగా పనిచేసిన వారికి టీడీపీ సీటు ఇవ్వలేదని అన్నారు.

మొదట 24 సీట్లు దక్కినందుకు గాయత్రీ మంత్రం అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారని, ఇప్పుడు 21 సీట్లకు ఏమి చెప్పాలో ఆయనకు త్రివిక్రమ్ రాసివ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు. జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పదిమంది టీడీపీ నేతలే ఉంటారని అన్నారు. ప్రజలంతా 175 స్థానాల్లో వైసీపీని గెలిపిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని అన్నారు.

Also Read: ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలు.. ఆప్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ అధికారుల సోదాలు