ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలు.. ఆప్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ అధికారుల సోదాలు

ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలు.. ఆప్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ అధికారుల సోదాలు

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాక కవిత భర్త అనిల్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇప్పటికే ఆయన రెండు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. తాజాగా శనివారం తెల్లవారు జాము నుంచి ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ, మాదాపూర్ లోని కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు.

Also Read : MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచన

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు వచ్చినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ద్వారా చేరిందనే విషయాలపై ఈడీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కవితను అరెస్టుచేసిన ఈడీ అధికారులు.. తమ కస్టడీలో విచారిస్తున్నాంరు. కవిత కస్టడీ ఈరోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆమె బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తుండటం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కేసులో అనిల్ పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.

అనిల్, వారి బంధువులు ఎంత ఆస్తులను కూడబెట్టారు. ఎంత మేరకు బినామీ ఆస్తులు ఉన్నాయనే విషయాలపై ఈడీ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అయితే, కవిత భర్త ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : Mlc Kavitha Interrogation : వాళ్లిద్దరితో కుమ్మక్కయ్యారా? ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం