×
Ad

Annadanam Trust: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటీ పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు

  • Published On : November 13, 2021 / 01:23 PM IST

Pankaj Reddy

Annadanam Trust: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటీ పదివేల నూట పదహారు రూపాయలు(రూ.1,00,10,116) విరాళంగా అందజేశారు కాంట్రాక్టర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ చైర్మన్‌ పంకజ్‌రెడ్డి.

నెల్లూరుకు చెందిన భవానీ కనస్ట్రక్షన్స్‌ ఎండీ అయిన పంకజ్‌రెడ్డి.. తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు ఈమేరకు విరాళం అందజేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు కలివేటి సంజీవయ్యతో కలిసి వో జవహర్‌ రెడ్డికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో పంకజ్‌రెడ్డి సతీమణి సరిత కూడా ఉన్నారు. దంపతులు ఇద్దరూ కలిసి విరాళాన్ని జవహర్‌ రెడ్డికి అందించారు.

Amith Shah Meeting: అమిత్ షా మీటింగ్.. సీఎం కేసీఆర్ హాజరుపై అనుమానాలు

Flight Charges: భారీగా పెరిగిన విమాన చార్జీలు..!