Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి రుణ ఒప్పందంలో పురోగతి లభించింది. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రపంచ బ్యాంకు, ఎడీబీ రుణ ఒప్పందం తుది అంకానికి చేరుకుంది. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన భేటి లో రెండు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు, ఎడీబీ సంస్థలు
సమకూర్చనున్నాయి.
ఈ ఒప్పందంలో పొందుపరిచే అంశాలపై కూలంకషంగా చర్చించి తుది ఒప్పంద పత్రాలను అధికారులు రూపొందించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత అవగాహన ఒప్పంద పత్రాలను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల తరపున జరగాల్సిన అన్ని అధికారిక లాంఛనాలను పూర్తి చేసినట్లు సమాచారం. ఖరారు చేసిన ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు, ఎడీబీ కేంద్ర కార్యాలయాల ఆమోదముద్ర వేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నరాు.
వచ్చే డిసెంబర్‌లో జరుగబోయే బోర్డు సమావేశంలో ప్రపంచ బ్యాంకు ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయనుంది. అతి త్వరలోనే ప్రపంచ బ్యాంకు, ఎడీబీలు రాజధాని నిర్మాణ నిధులకు ఆమోదముద్ర వేసి నిధులు విడుదల చేయనున్నాయి. మూడు నాలుగు దఫాలుగా జరిగిన చర్చల్లో సీఆర్డీఏ నుంచి అన్ని అంశాలపై ప్రపంచ బ్యాంకు, ఎడీబీ అధికారులు వివరాలు తీసుకున్నారు. సాంకేతిక, కోర్టు ఉత్తర్వులు, హరిత ట్రిబ్యునల్ ఆదేశాలపై సీఆర్డీఏ అధికారులు సవివరంగా ఇచ్చిన నివేదికలపై ప్రపంచ బ్యాంకు, ఎడీబీ అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Also : CM Revanth Reddy : ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని కొనసాగించండి.. మీ అందరి మద్దతు ఉండాలి : సీఎం రేవంత్