తిరుపతి ఎంపీ మృతిపై మోడీ సంతాపం

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపై ప్రధాని మోడీ సంతాపం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా బల్లి దుర్గారావు మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీ దుర్గా ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’అని ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు.


ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ‘తిరుపతి ఎంపీ శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారి విషాదకరమయిన మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓం శాంతిః అని ట్వీట్‌ చేశారు.



కాగా ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చెన్నైలోని ప్రైవేటు హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న ఆయనకు బుధవారం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.