Sadineni Yamini: మా పార్టీ అధ్యక్షురాలు ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేక మీరు ఇలా చేస్తున్నారు: సాధినేని యామిని

అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

Sadineni Yamini – YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సర్కారుపై బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మండిపడ్డారు. ఇవాళ విజయవాడ (Vijayawada)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ మద్యం అక్రమాలను తమ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేకపోయారని చెప్పారు.

ఏపీలో జరుగుతున్న అవినీతి, పెరిగిపోతున్న అప్పుల గురించి పురందేశ్వరి వివరించారని, దీంతో తట్టుకోలేక వైసీపీ నాయకులతో జగన్ తిట్టిస్తున్నారని సాధినేని యామిని శర్మ అన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారని వైసీపీకి అధికారం ఇచ్చారని, అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలు జగన్ పాలన ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వానిది అసమర్థ పాలన‌ అని విమర్శించారు.

అనంతరం బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి మాట్లాడుతూ… ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. రోడ్డు పక్కన టీ తాగినా అక్కడ ఫోన్ పేలో డబ్బులు చెల్లించవచ్చని, వందలు, వేల రూపాయలు పెట్టి కొన్న మద్యం సీసాలకు చెల్లించడానికి మాత్రం ఫోన్ పేని అందుబాటులో ఉంచడం లేదని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పారు.

Also Read: స్వరాష్ట్రంలో పెద్ద కొలువులేవి? ఒక్కరికీ ఉద్యోగం దక్కకలేదు : వైఎస్ షర్మిల

ట్రెండింగ్ వార్తలు