తిరుపతిలో శాడిస్టు భర్త : భార్య కాల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

Sadist husband in Tirupati Wife Audio Call : తిరుపతిలో శాడిస్టు భర్త అరాచకం వెలుగు చూసింది. ఎన్నో కలలు కని..అత్తింటి ఇంట్లో అడుగు పెట్టిన ఆ నవవధువుకు భర్త నరకం చూపించాడు. సినిమాల్లో శాడిస్టు భర్తలను చూస్తామోమో గాని…నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారని ఈ ఘటన చూపిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కాల్ గర్ల్ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించాడు. ఆమెకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు.
తిరుపతి శివారులోని తిమ్మినాయుడు పాలెంలో రోహిత్ కుమార్…టీటీడీకి చెందిన SGS కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. గత ఆగస్టులో ఓ యువతితో రేవంత్ కు వివాహం జరిగింది. ఆ యువతిని ప్రేమించి..పెద్దలకు నచ్చచెప్పిన రోహిత్..కొద్ది నెలల తర్వాత..తనలో అసలు రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లైన నాటి నుంచి భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. పది లక్షలు, బంగారం తీసుకరావాలంటూ..వేధించే వాడు. బరితెగించిన రోహిత్…భార్యను ఇంటి నుంచి గెంటివేశాడు. కట్నం తీసుకరాకపోతే..పోర్న్ సైట్ లో ఫొటో వివరాలు పెడుతానని బెదింరించాడు.
ఫలానా వెబ్ సైట్ లో కాల్ గర్ల్ గా పోస్టు చేశానని, అసభ్యపదజాలంతో దూషించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి…తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో భర్త రోహిత్ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ వ్యవహారంగా భావించి..ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. యువతి, ఆమె తల్లిదండ్రులను రోహిత్ బూతులు తిట్టాడు. అత్యంత దారుణంగా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేపడుతుండడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.