Sajjala: వారు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారు: సజ్జల

దాడులు వాళ్లే చేసి, మళ్లీ వాళ్లే బాధితులమంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో మృతి చెందిన మేకా వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలను తీసేందుకు కూడా టీడీపీ వెనకాడటం లేదని చెప్పారు. వైసీపీ వాళ్లని రెచ్చగొట్టి మరీ బైక్‌తో వచ్చి వేగంగా టీడీపీ వాళ్లు ఢీ కొట్టారని తెలిపారు.

తాము సంయమనంతో ఉన్నప్పటికీ టీడీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని చెప్పారు. దాడులు వాళ్లే చేసి, మళ్లీ వాళ్లే బాధితులమంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. సీఎంపై జరిగిన దాడి మర్చిపోక ముందే తాడేపల్లిలో టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తపై మరో దాడికి పాల్పడ్డారని చెప్పారు.

దాడులను వెనకేసుకొస్తున్నారని, దాడులను కూడా వైసీపీ డ్రామాలు అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీకి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందని అన్నారు. తాము మౌనంగా ఉన్నామని, అనవసరంగా వివాదాలు సృష్టించవద్దని చెప్పారు. ఇలాగే దాడులు చేయాలని టీడీపీ చూస్తోందని తెలిపారు. వైసీపీ నేతలు సమయమనం కోల్పోవద్దని చెప్పారు.

Also Read: అందుకే జగన్‌పై వీళ్లు రాయితో దాడి చేయించారు: వెల్లంపల్లి శ్రీనివాస్

ట్రెండింగ్ వార్తలు