Vellampalli Srinivas: అందుకే జగన్‌పై వీళ్లు రాయితో దాడి చేయించారు: వెల్లంపల్లి శ్రీనివాస్

జూన్ 4న అంతు చూస్తామంటూ చంద్రబాబు నాయుడు, బొండా ఉమా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

Vellampalli Srinivas: అందుకే జగన్‌పై వీళ్లు రాయితో దాడి చేయించారు: వెల్లంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivas

Updated On : April 20, 2024 / 4:32 PM IST

విజయవాడలో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చిందని, ఆయనను హతమార్చడానికే టీడీపీ పన్నాగం పన్నిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాయితో దాడి చేసి హతమార్చాలని అనుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమా దాడి చేయించారని అన్నారు.

తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ… వైసీపీనే ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించుకుందని టీడీపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. జూన్ 4న అంతు చూస్తామంటూ చంద్రబాబు నాయుడు, బొండా ఉమా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

డబ్బులు ఇవ్వలేదని.. దీంతో అన్నా క్యాంటీన్ తీసేశారని సతీశ్ అన్నాడని బొండా ఉమాకి ఎలా తెలుసని ప్రశ్నించారు. సతీశ్ అనే వ్యక్తి సీఎం మీద దాడి చేసిన సంగతి నిజమని చెప్పారు. బొండా ఉమ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

తాగడం.. తినడం మాత్రమే బొండా ఉమాకి తెలుసని వెల్లంపల్లి అన్నారు. ఆధారాలు ఉంటే బొండా ఉమను A1గా చేస్తారని చెప్పారు. జూన్ 4 తర్వాత జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశాక ఆ దాడి మీద పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు. సీబీఐని ఏపీకి రాకుండా చేసింది చంద్రబాబు కాదా? అని అన్నారు.

 Also Read: ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాం.. మా సర్కారుని ఆ పార్టీలు పడగొట్టాయనుకో..: రేవంత్ రెడ్డి