Sajjala Ramakrishna Reddy
కౌంటింగ్‌కి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ వాళ్లందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇవాళ అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
వైసీపీ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సంబరాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పామని అన్నారు. ఈసీపై చంద్రబాబు నాయుడి నియంత్రణ ఉందని తెలిసిపోతోందని ఆరోపించారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు.
తమ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సజ్జల చెప్పారు. టీడీపీ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి ఇవాళ్టితో ముగింపు ఉంటుందని తెలిపారు. ఏం జరుగుతుందో చంద్రబాబుకి తెలుసుకనుకే మౌనం వహిస్తున్నారని చెప్పారు. నారా లోకేశ్ పత్తా లేకుండాపోయారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చిన నంబర్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.
Also Read: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం.. సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు