పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం.. సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

Supreme Court
Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ పిటీషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.