Sajjala Ramakrishna Reddy : ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

Sajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జుల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేశారు.

Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు తమ రాజీనామాలను సమర్పించగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో రాజీనామా చేశారు. తన రాజీనామ లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి ఆయన పంపించారు. సజ్జల రామకృష్ణతో పాటు సలహాదారులుగా వ్యవహరించిన మరో 20 మందికి కూడా తమ రాజీనామాలను సమర్పించారు. తమ రాజీనామా పత్రాలను సీఎస్‌కు పంపించారు.

ట్రెండింగ్ వార్తలు