Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? : సజ్జల సెటైర్లు

పవన్ కల్యాణ్ కి ఎలాంటి ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే...చంద్రబాబుకి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

sajjala ramakrishna reddy

Chandrababu..sajjala ramakrishna reddy : పవన్ కల్యాణ్ కి ఎలాంటి ప్రలోభాలు పెట్టారో పక్కన పెడితే…చంద్రబాబుకి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు వున్నారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కి భయాన్ని పరిచయం చేస్తానని లోకేశ్ అంటున్నారు..ఆయనే ఓ జోకర్ అంటూ ఎద్దేవా చేశారు.గతంలో నిరోద్యుగ బృతి రెండు వేలు ఇస్తామని అన్నారు ఇచ్చారా?అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు లోకేశ్ నిరుద్యోగ భృతిగా రూ.3వేలు ఇస్తామంటున్నారని విమర్శించారు.

అధికారులు సెంట్రల్ సర్వీస్ కి వెళుతున్నారు అని కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని..దీనిపై అధికారులు పరువు నష్టం దావా వేస్తారని అన్నారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దేబ్బతింటారని..పవన్, చంద్రబాబు, లోకేష్ అంతా వుండేది పక్క రాష్ట్రంలో..కానీ పెత్తనం చేయాలి అనుకునేది ఏపిలో అని అన్నారు. మాకు వణుకు పుడితే బస్ యాత్ర చేస్తామా? అని ప్రశ్నించారు.

యుద్ధం మొదలైంది.. ఆ మంత్రులకు కౌంట్‎డౌన్ మొదలైంది.. లోకేశ్ మాస్ వార్నింగ్

కాకినాడ డాక్టర్ ఆత్మహత్యలో వైసీపీ నేతలకు ఏమి సంబంధం..? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి నష్ట పోయింది కల్యాణ్ అని..చనిపోయిన వ్యక్తి తల్లే వైసీపీ నేతలకు సంబంధం లేదని చెబుతోందని తెలిపారు.కురసాల కల్యాణ్ భవిష్యత్ నాశనం చేయాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు.టీడీపీ, జనసేన పార్టీల చిల్లర రాజకీయాలకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు.