Nara Lokesh : యుద్ధం మొదలైంది.. ఆ మంత్రులకు కౌంట్‎డౌన్ మొదలైంది.. లోకేశ్ మాస్ వార్నింగ్

53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేశారు. ఒక్క ఆధారంకూడా చూపించలేక పోయారని లోకేశ్ అన్నారు. నామీదకూడా సీఐడీ కేసులు పెట్టారు. భయపడలేదు, ధైర్యంగా సమాధానం ఇచ్చాను. చివరికి మా అమ్మ భవనమ్మనుకూడా వదల్లేదు.

Nara Lokesh : యుద్ధం మొదలైంది.. ఆ మంత్రులకు కౌంట్‎డౌన్ మొదలైంది.. లోకేశ్ మాస్ వార్నింగ్

nara lokesh

Yuva Galam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పున: ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు.. యువగళానికి తాత్కాలిక విరామం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు నన్ను క్షమించాలని అన్నారు. యువగళం ద్వారా అన్నివర్గాల ప్రజలను కలుస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. యుద్ధమొదలైంది.. మూడు నెలల్లో సైకో జగన్ ను పిచ్చాస్పత్రికి పంపిస్తానని చెప్పారు.

Also Read : రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? : హ‌రీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

అడ్డుకుంటే దండయాత్రే ..
ఈ గొంతు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇచ్చిన గొంతు. దీనిని ఎవ్వరూ ఆపలేరని నారా లోకేశ్ అన్నారు. యువగళం జరగనిస్తే పాదయాత్ర.. లేకపోతే దండయాత్ర అంటూ అధికార పార్టీని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడిని చూస్తే జగన్ వణికిపోతున్నాడని, చంద్రబాబునే కాదు ఆయన తల్లి, చెల్లిని చూస్తేకూడా జగన్ భయపడుతున్నాడని లోకేశ్ అన్నాడు. బస్సు యాత్ర కాస్త తుస్ యాత్ర అయింది. జగన్ ఓడిపోయిన తరువాత ఎక్కడి వెళ్తాడు.. నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చాసుపత్రికి. రుషి కొండకు గుండు కొట్టి కోట్లతో ఇల్లు కట్టుకున్నడు. జగన్ చూస్తే కటింగ్ ఫిటింగ్ మాస్టర్.. బల్లపైన బ్లూ బటన్, బల్ల కింద రెడ్ బటన్ నొక్కుతాడు. ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ పథకాలను జగన్ కట్ చేశాడంటూ లోకేశ్ అన్నారు.

Also Read :  PM Modi : భారతీయ ప్రముఖులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఆ బాధ్యత నేను తీసుకుంటాం..
53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేశారు. ఒక్క ఆధారంకూడా చూపించలేక పోయారని లోకేశ్ అన్నారు. నామీదకూడా సీఐడీ కేసులు పెట్టారు. భయపడలేదు, ధైర్యంగా సమాధానం ఇచ్చాను. చివరికి మా అమ్మ భవనమ్మనుకూడా వదల్లేదు. ఆ మంత్రులకు చెబుతున్న.. వారికి కౌంట్ డౌన్ మొదలైంది. మీకు భయాన్ని పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడం. మీరు ఎన్ని కేసులు పెట్టిన పరవాలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో కేసులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అంటూ నారా లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మొత్తం కక్కిస్తా.. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మొత్తం వైసీపీ క్యాడర్ జైల్లోనే ఉంటుంది.

Also Read : Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి.. 

తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రేమ.. మరోపక్క భయం ఉందని లోకేశ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా బ్రేక్ పడుతుందన్నారు. ఈ జిల్లా నుంచి ఐదుగురు మంత్రులు అయ్యారు. ఈ జిల్లాకు మీరు చేసింది ఏమిటని లోకేశ్ ప్రశ్నించారు. రాపాక వరప్రసాద్ నమ్మిన పార్టీని మోసం చేసి జగన్ పార్టీలో చేరాడు. ఐదెకరాల్లో ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాడు. రాజోలు నియోజకవర్గంలో సజ్జల ఆధ్వర్యంలో భూ దందా చేస్తున్నారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, డ్రెయినేజీ వ్యవస్థ బాగు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులకు లోకేశ్ మూర్ఖుడు.. రాజోలులో ఉన్నా.. రష్యాకి పారిపోయిన తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేశ్ తీసుకుంటాడని అన్నారు.