Sajjala Ramakrishna Reddy (Photo : Twitter, Google)
Sajjala Ramakrishna Reddy – Pawan Kalyan : బీజేపీ అగ్ర నాయకులపైన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి బీజేపీ అగ్ర నాయకులు అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శలు, ఆరోపణలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. సెంట్రల్ మినిస్టర్లే జగన్ పాలనను పొగుడుతున్నారని సజ్జల గుర్తు చేశారు. అలాంటిది.. కేంద్రం నుంచి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు విదేశాల నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా సజ్జల తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్ లో యాంటీ వైసీపీ ఓటు చీలకూడదని పవన్ అంటున్నారు, ఇన్నాళ్లు పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా? అని ఆయన ప్రశ్నించారు. మాకు అభ్యంతరమే లేదు తిరగండని చెప్పారు. సినిమా డైలాగ్స్ లా.. అధికారం మా లక్ష్యం కాదనడం.. స్క్రిప్ట్ లా ఉంటుందని ఎద్దేవా చేశారు. గాజు గ్లాసు ఎవరైనా తీసుకోకపోతే ఆ పార్టీకి సింబల్ ఇస్తారేమో అని సెటైర్ వేశారు. చంద్రబాబును సీఎం చేయడం లక్ష్యం అంటూ.. తనను నమ్ముకున్న వాళ్లను పవన్ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
” బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల స్క్రిప్ట్.. టీడీపీ వాళ్లు రాసి ఇచ్చింది. బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రాసిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జేపీ నడ్డా చదివారు. ప్రభుత్వంపై చేసినవి వైల్డ్ అలిగేషన్స్ మాత్రమే. ఎన్నికలు వస్తున్నాయి కదా. అందుకే అలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. టీడీపీ డైలాగులు చిలక పలుకుల్లా పలికారు. ప్రభుత్వంలో అసలు స్కామ్ లకు అవకాశమే లేదు. అనాలి కాబట్టి అంటున్నారు. కేంద్ర మంత్రులే ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.
దేశంలో ఎవరైనా యాత్రలు చేయవచ్చు. పవన్ ఇన్నాళ్లు చేయకుండా ఎన్నికలు వస్తున్నాయని నాలుగు డైలాగులు రాసుకుని యాత్రకు వెళ్ళారు. వైసీపీ విముక్త రాష్ట్రం కాదు.. చంద్రబాబును కూర్చో బెట్టాలని యాత్ర. చంద్రబాబు ఇచ్చిన అసైన్ మెంట్ తో పవన్ బయలుదేరారు. జనసేన పార్టీకి సింబల్ కూడా లేదని విన్నాను. సంస్థాగతంగా ఏమీ లేదు. నమ్ముకున్న వాళ్లను మోసం చేయడానికి పవన్ బయలుదేరారు” అని సజ్జల అన్నారు.