×
Ad

సంక్రాంతికి ఊరెళుతున్నారా? ప్రత్యేక రైళ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకోండి.. అన్ని రైళ్ల వివరాలు ఇవే..

ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లను నడుపుతారు.

Sankranti: సంక్రాంతి పండుగకు ఊరెళుతున్నారా? దక్షిణ మధ్య రైల్వే నడపనున్న ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

YS Jagan: వైసీపీ అధినేత జగన్‌కు అసలు ప‌రీక్ష మొద‌లైందా..?

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లను నడుపుతారు. 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఈ రైళ్లలో ఉంటాయి. (Sankranti)

సంక్రాంతి పండుగ వేళ రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల ముందే రెగ్యులర్‌ రైళ్లలో టికెట్లు అయిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి నుంచి కాకినాడకు, నర్సాపూర్‌కు, తిరుపతికి వెళ్లనున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి 20 వరకు ఈ సర్వీసులు ఉన్నాయి.