Gadikota Srikanth Reddy
Gadikota Srikanth Reddy – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ విషయంలోనూ క్లారిటీ లేని పవన్ కల్యాణ్ కు అసలు రాజకీయాలు ఎందుకు? అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఊగిపోతూ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నిన్ను బలిపశువును చేస్తున్నారు.. అది గమనించాలి అని పవన్ కు సూచించారాయన. చంద్రబాబు ట్రాప్ లో పడిన పవన్ రోజురోజుకీ దిగజారిపోతున్నారు అని ఆయన చెప్పారు.
”నేను, సీఎం జగన్ కలిసి టెన్త్ క్లాస్ కలిసి చదివామని, పేపర్ దొంగతనం చేశానని పవన్ అంటున్నారు. నేను చదివింది కడపలో.. జగన్ చదివింది హైదరాబాద్ లో.. ఈ విషయాలు పవన్ తెలుసుకోవాలి.. మేమిద్దరం ఎప్పుడు పేపర్ దొంగతనం చేశాం? పోలీసులు ఎప్పుడు అరెస్టు చేశారు? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు కాదా..? పవన్ లాంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.(Gadikota Srikanth Reddy)
Also Read..Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్
మహిళా సీఐను వ్యక్తిగతంగా దూషించారు కనుకే చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. లా అండ్ ఆర్డర్ సమస్య రావడంతోనే చెయ్యి చేసుకున్నారు. ఏం జరిగిందని పవన్ తిరుపతి వచ్చి హడావిడి చేశారు..? ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో క్లారిటీ ఉండదు. ఎక్కడ పోటీ చేస్తాడో క్లారిటీ ఉండదు. ఈయనకెందుకు రాజకీయాలు?
చంద్రబాబు సీమకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమయ్యారు? సీమ రౌడీలు తుని రైలు తగలబెట్టారు అన్నప్పుడు పవన్ ఏమయ్యారు? సీమ ప్రాజెక్టులను గాలికి వదిలేసినప్పుడు పవన్ ఏమయ్యారు? న్యాయ రాజధాని సీమలో వద్దని అడ్డుకుంటుంటే పవన్ ఏమయ్యారు..? సీఐ అంజూయాదవ్ కు పవన్ కల్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. సీఐ అంజూ యాదవ్ ను దూషించిన మీ వాళ్ళని మందలించాలి. జనసేన పార్టీ రౌడీ సేన పార్టీగా మారింది.
Also Read..New Ration Cards : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు
మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారితోనే మేముంటాం. అది కాంగ్రెస్సా? బీజేపీనా? అనేది మాకు అనవసరం. మా అజెండా రాష్ట్ర ప్రయోజనం. విశాఖలో ప్రజల సమక్షంలోనే సీఎం జగన్ ప్రధానికి హోదా విషయం చెప్పారు. చంద్రబాబు తన మనుషులను బీజేపీ, కాంగ్రెస్ లో పెట్టారు. బీజేపీలో సుజనా చౌదరి, సీఎం రమేశ్ నీ పెట్టారు. కాంగ్రెస్ లో రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి ని పెట్టారు” అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెయ్యి చేసుకోవడాన్ని పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా తిరుపతి వెళ్లి సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్.. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టె సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు.
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులను అదుపు చేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై సీఐ అంజూ యాదవ్ చెయ్యి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. తాను జన సైనికులకు అండగా ఉంటానని చెప్పారు. ఇందులో భాగంగా సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేశారాయన.