New Ration Cards : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది.

new ration cards
AP Government : రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ త్వరలోనే 1.67 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ ప్రకటనతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.