AP : స్కూళ్లు రీ ఓపెన్, ఎప్పటి నుంచి అంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ లో మూతపడిన పాఠశాలలు 2021, ఆగస్టు 16వ తేదీన ప్రారంభం కానున్నాయి.

Ap Schools

Schools Reopening : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ లో మూతపడిన పాఠశాలలు 2021, ఆగస్టు 16వ తేదీన ప్రారంభం కానున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం తరువాతి రోజున స్కూళ్లు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. నాడు – నేడు తొలి విడత పనులను అదే రోజున ప్రజలకు అంకితం చేయనుంది. రెండో విడతను నాడు – నేడు పనులను ప్రారంభించనుంది.

Read More : Priyanka Chopra : ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక..

విద్యార్థిని, విద్యార్థులకు ‘విద్యా కానుక’ కిట్లను కూడా అందచేయనుంది. ప్రైవేటు స్కూల్స్ కూడా తిరిగి ఓపెన్ చేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటికే పది, ఇంటర్..ఇతర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా..రెండు విద్యా సంవత్సరాలు నష్టపోయాయి. పూర్తిగా ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థులు పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతుండడంతో స్కూళ్లు తిరిగి ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.