Priyanka Chopra : ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక..

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్మడంతో పాటు ఆఫీస్ ప్లేస్‌ని కూడా లీజుకిచ్చేసింది..

Priyanka Chopra : ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక..

Priyanka Chopra

Updated On : July 23, 2021 / 1:29 PM IST

Priyanka Chopra: సెలబ్రిటీలు కొత్త ఆస్తులు కొనడం, ఉన్న ప్రాపర్టీలను అమ్ముకోవడం.. ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంటాయి. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, ముంబై, గోవా, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో తనకున్న ప్రాపర్టీస్‌లో కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్మడంతో పాటు ఆఫీస్ ప్లేస్‌ని కూడా లీజుకిచ్చేసింది.

ముంబై అంధేరి వెస్ట్‌లోని ఓషివారాలో ఉన్న వాస్తు ప్రెసింక్ట్ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న 2040 స్క్వేర్ ఫీట్స్ కలిగిన ఆఫీస్ స్పేస్‌ని నెలకు 2.11 లక్షలకు లీజుకు ఇచ్చింది. అలాగే రెండు ప్లాటులను అక్షరాలా 7 కోట్ల రూపాయలకు అమ్మింది.

Priyanka Chopra

 

888 చదరపు అడుగులతో 7వ ఫ్లోర్‌లో ఉన్న ప్లాటుని రూ. 3 కోట్లకు, అదే ఫ్లోర్‌లో 1219 చదరపు అడుగుల విస్తీర్ణం గల మరో ప్లాటుని రూ. 4 కోట్లకు.. అలాగే గతేడాది ఫిబ్రవరిలో, అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని కరణ్ అపార్ట్‌మెంట్ నాల్గవ అంతస్తులో ఉన్న ప్లాటును రూ .2 కోట్లకు ప్రియాంక చోప్రా అమ్మినట్లు అక్కడి స్టాక్ బ్రోకర్స్ వెల్లడించారు.