AP Local Body Elections Schedule: ఏపీ స్థానిక పోరు నోటిఫికేషన్ విడుదల.. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు.. అక్టోబర్ 28న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ స్థానిక(AP Local Body Elections Schedule) సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
ap local body elections schedule released polling october 28 results october 30
AP Local Body Elections Schedule:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత కీలకమైన అడుగులు వేసింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో(AP Local Body Elections Schedule) పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా ఒక సమగ్రమైన మూడంచెల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠను పెంచుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, ఇప్పటికే అన్ని ప్రధాన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా ‘ఆల్ పార్టీ మీటింగ్’ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమగ్రంగా చర్చించారు.
YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. ఇక రోజువారీ విచారణ.. సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం!
తొలి దశలో పట్టణ పోరు.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఫలితాలు:
మూడు దశల ఎన్నికల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థానాలకు సమరం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత పట్టిక ప్రకారం అక్టోబర్ 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 19, 20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అక్టోబర్ 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించి, ముగిసిన రెండు రోజులకే అంటే అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఆ వెంటనే రెండో దశలో పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) పోరు జరగనుండగా, నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి నవంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తారు. చివరిగా మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
జెడ్పీ, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాల రిజర్వేషన్ల సమగ్ర వివరాలు:
ఎన్నికల నిర్వహణతో పాటు జిల్లాల వారీగా స్థానాల కేటాయింపును పూర్తి చేశారు. 17 కార్పొరేషన్లలో బీసీలకు 5 మేయర్ స్థానాలు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 కేటాయించగా, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్గా 4 స్థానాలను నిర్దేశించారు. ఇక 106 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 3, ఎస్సీలకు 14 (మహిళలకు 7), బీసీలకు 36 (మహిళలకు 18), జనరల్ మహిళలకు 27, జనరల్ కేటగిరీకి 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించారు. అలాగే జెడ్పీ స్థానాలకు సంబంధించి అనంతపురం, కర్నూలు, విశాఖ బీసీలకు, ఎన్టీఆర్, ప్రకాశం ఎస్సీలకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. పార్వతీపురం, అల్లూరి ఎస్టీలకు, పొలవరం ఎస్టీ మహిళకు దక్కగా.. తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, కృష్ణా, బాపట్ల, కాకినాడ, చిత్తూరు జనరల్ మహిళలకు, కోనసీమ, తిరుపతి, గుంటూరు ఎస్సీ మహిళకు ఖరారయ్యాయి.
ఓటర్ల ప్రభావానికి చెక్.. పోలింగ్ బూత్లలో సీసీ కెమెరాలు, గట్టి భద్రత:
ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సూచనల మేరకు ఎస్ఈసీ పలు కఠిన చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు అవసరమైన కుల, నేటివిటీ ధ్రువీకరణ పత్రాలను అధికారులు సకాలంలో జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు పోలీసు, అబ్కారీ శాఖల ద్వారా నిఘా తీవ్రతరం చేశారు. ప్రతీ పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోటీ చేసే అభ్యర్థుల భద్రతకు సంబంధించి పోలీసు రక్షణ కల్పిస్తామని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం భరోసా ఇచ్చింది.
