రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టెంట్లు వేసుకుని రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వారి పిల్లలతో ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..తమకు న్యాయం చేయాలని, రాజధాని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేశారు.
* ఉద్దండరాయుని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
* తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమి గ్రామాల్లో మహా ధర్నా చేపట్టారు.
* ప్రధాని మోడీ చిత్రపటంతో తుళ్లూరు రైతులు బైఠాయించారు.
* ధర్నాలో విద్యార్థులు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
* మందడంలో రైతులు చేస్తున్న ధర్నాకు విద్యార్థులు మద్దతు పలికారు.
తమ భవిష్యత్ బాగుండాలనే రైతులు త్యాగాలు చేశారని చెప్పారు. మూడు రాజధానులు అభివృద్ధి చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనే వరకు రైతులకు మద్దతుగా ఉంటామని హామీనిచ్చారు.
ఇదిలా ఉంటే..రాజధాని ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలకు భధ్రతను పెంచారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా చేపట్టారు. 29 గ్రామాల్లో APASP పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
గతంలో ఉన్న సమయంలో జగన్ ఎలా మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని మహిళలు తెలిపారు. మూడు రాజధానులు అసలే వద్దు..తమ పిల్లలు ఏమయి పోవాలి ? అంటూ నిలదీశారు. సీఎం జగన్ చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులు..తమకు మోసం చేయడం తెలియదన్నారు.
Read More : కన్నా కీలక వ్యాఖ్యలు : మూడు రాజధానులు చేస్తే..కేంద్రం నిధులు ఇవ్వదు