Security Increased For Mla Alla Ramakrishnareddy1
Security increased for MLA Rk : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పుడున్న గన్‌మెన్లకు అందనంగా మరో నలుగురు గన్‌మెన్లను కేటాయించింది. ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆర్కే కీలకంగా మారారు. తాను ఇచ్చిన ఫిర్యాదుతోనే సీఐడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.
ఇద్దరినీ విచారణకు హాజరుకావాలని కోరింది. మరోవైపు ఆర్కేను కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించడంతో.. ఇవాళ సీఐడీ విచారణకు హాజరయ్యారు. తన దగ్గరున్న ఆధారాలు, వివరాలను సీఐడీకి అందజేశారు. దీంతో ఆయనకు ఎలాంటి హాని జరుగకుండా ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది.