Corona Virus
Sensational things on Corona boom : కరోనా విజృంభణపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి కరోనా నిబంధనలు, భౌతిక దూరం లాంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో అతడి నుంచి 406 మందికి కరోనా సోకే అవకాశముందని పరిశోధనలో తేలింది. అదే భౌతిక దూరం, కోవిడ్ నిబందనలు 50 శాతం మేర పాటిస్తే 406కు బదులుగా 15 మందికి మాత్రమే సోకుతుందని, ఇక 75 శాతం మేర పాటిస్తే ముగ్గురికి మాత్రమే సోకుతుందని కేంద్రం వెల్లడించింది.
ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని కరోనా నియంత్రణకు తమకు సహకరించాలని కేంద్రం కోరింది. కరోనా నియంత్రణకు భౌతిక దూరమే ముఖ్యమని, మాస్కులు, శానిటైజర్లు వైరస్ వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని తెలిపింది. దయచేసి అత్యవసర విషయానికి తప్ప బయటకు వెళ్లద్దని, ఇతరులను ఇళ్లకు ఆహ్వానించద్దని సూచించింది.
మరోవైపు కరోనా విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకోవాల్సిన సమయం అసన్నమైందని కేంద్ర స్పష్టం చేసింది. వ్యాధి సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలని తెలిపింది. ఏ మాత్రం కరోనా లక్షణాలున్న రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని సూచించింది. లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చే అంతవరకూ అందరికీ దూరంగా ఉంటే మంచిదని వెల్లడించింది.