×
Ad

Road Accident Seven Killed : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • Published On : December 7, 2022 / 11:25 PM IST

Seven people killed

Road Accident Seven Killed : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. పెళ్లి బృందంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం సాయంత్రం పూతలపట్టు లక్ష్మయ్య గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ సహా ఏడుగురు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 19 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

బాధితులు ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గత నెలలో పూతలపట్టు మండలానికి సమీపంలోని కాణిపాకం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆగి ఉన్న పాల ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.