Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident

Updated On : December 5, 2022 / 8:56 AM IST

Road Accident: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road Accdient: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయితే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడినట్లు సమాచారం. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం నెలకొంది.