Trains Cancel
Several trains were canceled : సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు రైళ్ళు రద్దయ్యాయి. పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం-లోకమాన్యతిలక్(08519) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు. లోకమాన్యతిలక్ టెర్మినల్-విశాఖపట్నం(08520) ప్రత్యేక రైలు ఏప్రిల్ 11 నుంచి జూన్ 1 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం రైళ్లను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట-బల్హార్షా సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం(02805-02806) ప్రత్యేక రైళ్లు ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు వయా విజయనగరం, రాయగడ, టిట్లాఘర్, రాయ్‌పూర్, గోండియా, నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు.