Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. పది రోజులు పది అవతారాల్లో అమ్మవారి దర్శనం

ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమివ్వనున్నారు.

Indrakeeladri: విజయవాడ, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు పది రోజులపాటు.. పది రూపాల్లో దర్శనమిస్తారు.

BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

సోమవారం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి రోజూ తెల్లవారుఝామున 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. నవరాత్రుల సందర్భంగా సౌకర్యాల విషయంలో కొన్ని మార్పులు చేశారు. అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అన్నదానం బదులు భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. నదీ స్నానం బదులు షవర్స్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 21 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. సోమవారం ఉదయం సీపీ దంపతులు తొలి పూజ నిర్వహిస్తారు.

RRR: కొమురం భీముడో కాదా.. ఇది యాడ్ ఆ.. భలే సెట్ చేశారుగా!

అలాగే తొమ్మిది గంటలకు గవర్నర్ హరిచందన్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూలానక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. నేడు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంకారంలో దర్శనమిస్తారు. ఇప్పటికే దుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. వీరికి రాత్రి 10.30 గంటల వరకు దర్శనం కల్పిస్తారు.

 

ట్రెండింగ్ వార్తలు