BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

BiggBoss 6 Day 21 neha chowdary eliminated fro BiggBoss

BiggBoss 6 Day 21 :  బిగ్‌‌బాస్‌ ఆరో సీజన్ అప్పుడప్పుడు ఫైర్ తో, అప్పుడప్పుడు చప్పగా సాగుతోంది. మూడో వారం కూడా పూర్తయిపోయింది. అందరూ ఊహించినట్టుగానే మూడోవారం నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ఆదివారం ఎపిసోడ్ లో అన్ని వింత వింత టాస్కులు ఇచ్చాడు బిగ్‌‌బాస్‌. మొదట ఇంటి సభ్యులకి ‘సుత్తిదెబ్బ’ అనే ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇవ్వాలి అక్కడ ఉన్న ఆడియన్స్ దానికి ఒప్పుకుంటే ఓకే. లేకపోతే సుత్తిదెబ్బ తినాల్సి ఉంటుంది. ఇందులో నోటి దూల, హార్ట్ లెస్, బిట్టర్, యూజ్ లెస్ అనే కొన్ని వర్డ్స్ ని ఇచ్చారు. దీంట్లో కంటెస్టెంట్స్, ఆడియన్స్, నాగార్జున కూడా గీతూకి నోటిదూల అని తేల్చేశారు. ఇంతమంది అదే మాట చెప్పాక అయినా తన మీద ఉన్న నెగిటివిటీని గ్రహించి గీతూ మారుతుందేమో చూడాలి.

ఇక ఇదే టాస్క్ లో కొన్ని జంతువుల పేర్లు ఇచ్చి వాటిని కూడా ట్యాగ్ చేయమన్నారు. ఇందులో పాము, గాడిద, ఊసరవెల్లి, ఏనుగు, సింహం.. లాంటి జంతువుల ట్యాగులు ఉండగా వాటిని ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్పామన్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఆ ట్యాగ్ ఇచ్చి ఎందుకు ఇచ్చారో చెప్పారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరికి కలిపి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో సభ్యులని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ టాస్కులో బాలాదిత్య బాగా ఆడటంతో అతనికి బెస్ట్ కంటెస్టెంట్ గా పేరు ఇచ్చారు.

BiggBoss 6 Day 20 : బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేయడం.. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న నాగార్జున!

ఆటలు, టాస్కులు అయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు బిగ్‌‌బాస్‌. నామినేషన్ లో ఉన్న వాళ్లందరిలో చివరిగా వాసంతి, నేహా చౌదరి మిగలగా తక్కువ ఓట్లు వచ్చాయని నేహా ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు నాగార్జున. దీంతో మూడో వారం బిగ్‌‌బాస్‌ నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. వెళ్లేముందు స్టేజిపైకి వచ్చింది నేహా. నాగార్జున హౌజ్‌లో దమ్మున్నవాళ్లెవరు, దుమ్మున్నవాళ్లు ఎవరు చెప్పి వేళ్ళు అనే ఓ టాస్క్ ఇచ్చాడు. దీంతో నేహా రేవంత్‌, ఆరోహి, ఇనయ, అర్జున్‌, గీతూ, వాసంతి దుమ్మున్న వాళ్లు అని, వారి ఆటలో జెన్యూనిటీ లేదని, ఎలాగైనా గెలవాలని అనుకుంటారని, దానికోసం ఏదైనా చేస్తారని, వారి ఆట తీరు కరెక్ట్ కాదని తెలిపింది. ఇక చంటి, రాజ్‌, సుదీప, ఆది, బాలాదిత్య, శ్రీహాన్‌, శ్రీసత్యలు దమ్మున్నవాళ్ళు అని, వీళ్లంతా జాగ్రత్తగా గేమ్ ఆడతారని తెలిపింది నేహా చౌదరి.

హౌస్ లో రాజ్ తో మంచి బంధం ఏర్పడిందని, ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని, బయటకి వచ్చేశాక కూడా రాజ్ కి నేను బాడీ గార్డ్ లా ఉంటానని చెప్తూ ఎమోషనల్ అయింది నేహా. నేహా ఎలిమినేషన్ తో మూడో వారం ఎపిసోడ్ ముగిసింది.