BiggBoss 6 Day 20 : బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేయడం.. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న నాగార్జున!

బిగ్‌బాస్ సీజన్ 6 మూడోవారం మూగేసి సరికి ప్రేమకథలతో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. వారం మొదటిలో నామినేషన్స్, టాస్క్ లంటూ కొట్టుకున్న, వీకెండ్ వచ్చేసరికి ఒకరికి ఒకరు ప్రేమ మాటలు చెప్పుకుంటూ ఎపిసోడ్స్ ని చాలా సరదాగా నడిపించారు. ఇక శనివారం వచ్చిన నాగార్జున ఈ ప్రేమకథలను, వారి ఆట తీరుని బయట పెడుతూ.. కొంచెం ఘాటు అనిపించే స్వీట్ వార్నింగ్ లే ఇచ్చాడు.

BiggBoss 6 Day 20 : బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేయడం.. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న నాగార్జున!

BiggBoss 6 Saturday Episode

BiggBoss 6 Day 20 : బిగ్‌బాస్ సీజన్ 6 మూడోవారం మూగేసి సరికి ప్రేమకథలతో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. వారం మొదటిలో నామినేషన్స్, టాస్క్ లంటూ కొట్టుకున్న, వీకెండ్ వచ్చేసరికి ఒకరికి ఒకరు ప్రేమ మాటలు చెప్పుకుంటూ ఎపిసోడ్స్ ని చాలా సరదాగా నడిపించారు. ఇక శనివారం వచ్చిన నాగార్జున ఈ ప్రేమకథలను, వారి ఆట తీరుని బయట పెడుతూ.. కొంచెం ఘాటు అనిపించే స్వీట్ వార్నింగ్ లే ఇచ్చాడు.

BiggBoss 6 Day 20 : “నీ ఆట తీరు చూసి మేము కూడా షాక్‌లో ఉన్నాం”.. నాగార్జున

రావడం రావడంతోనే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మందిలో ఇద్దరు బయటకు వెళ్లిపోగా, మిగిలిన ఏడుగురు ఈ వారం మళ్ళీ నామినేషన్స్ లో ఉన్నారు కదూ.. వాళ్ళు సోఫా వెనక్కి వెళ్లి నిలబడండి అంటూ మొదలు పెట్టిన నాగార్జున.. వాళ్లలో శ్రీహన్, శ్రీసత్య లను సేవ్ చేస్తూ కూర్చోబెడుతూ.. బాలాజీ ఆట తీరు బాగోలేదంటూ, వీడియోలు వేసి మరి చూపించి వార్నింగ్ ఇచ్చాడు.

ఇక ఈ వారం బిగ్‌బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆట తీరుకు మార్కులు ఇస్తూ.. వారి ఆట విధానం వాళ్లకి తెలిసేలా చేసాడు నాగార్జున. ఈ క్రమంలో గీతూ, ఆదిరెడ్డి,శ్రీ సత్యలు 10 మార్కులు తెచ్చుకుని టాప్ లో నిలవగా, వాసంతి, కీర్తి లు తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. శ్రీహన్, శ్రీసత్య ల ఆట తీరు మెరుగు పడిందని మెచ్చుకున్నా నాగ్.. శ్రీరాజ్, చంటీ, అర్జున్ కల్యాణ్ ల ఆట తీరుపై చివాట్లు పెట్టాడు.

అలాగే ఈ వారం ఎక్కువుగా ఆడియన్స్ ని ఇన్ వాల్వ్ చేస్తూ.. బయట కంటెస్టెంట్స్ గురించి ఏమనుకుంటున్నారనే విషయాలను నేరుగా కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ చెప్పేలా చేశాడు నాగార్జున. ఈ క్రమంలో అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం బాగా ట్రై చేస్తున్నాడంటూ ఆడియన్స్ చెప్పగా.. సూర్య-ఆరోహీ రిలేషన్ గురించే నాగ్ బయటపెట్టాడు.

ఇలా ఈ శనివారం సరదాగా సాగినా, చివరిలో మాత్రం ట్విస్ట్ ఇస్తూ బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేసే హక్కు బిగ్‌బాస్ నాగ్ కి ఇచ్చాడంటూ బాంబు పేల్చాడు. అయితే నాగార్జున ఆ హక్కుని హౌస్ మేట్స్ కి ఇచ్చి వెనుక ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారంటూ అడగగా.. కీర్తీ, అర్జున్ కల్యాణ్ కు ఎక్కువ వేసి డైరెక్ట్ నామినేట్ చేశారు హౌస్ మేట్స్.